తాజా వార్తలు

Tuesday, 12 July 2016

సల్లూబాయ్‌ ‘సుల్తాన్‌’కు కలెక్షన్ల వర్షం

సల్మాన్‌ ఖాన్‌ లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్‌’ బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపుతోంది. విడుదల అయిన ఐదు రోజులకే రూ.344.5 కోట్లు కలెక్ట్‌ చేసి ట్రేడ్‌ పండిట్స్‌ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ సల్లూబాయ్‌ ‘సుల్తాన్‌’కు కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
రంజాన్ స్పెషల్‌గా రిలీజైన సుల్తాన్ మూవీ… భారతీయ సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డ్‌లను క్రియేట్ చేస్తోంది. రోజురోజుకూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది సుల్తాన్. రికార్డ్‌లు సృష్టించడంలో తనకు పోటీనేలేరని సినిమా సాక్షిగా తొడగొట్టాడు కండలవీరుడు. సినిమాలో రెజ్లర్‌గా కన్పించిన సల్మాన్‌ఖాన్… తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు.
ఈ నెల 7న విడుదలైన ‘సుల్తాన్’ దేశవిదేశాల్లో ఘన విజయం సాధించింది. దీంతో తొలివారంలో ఈ సినిమా సుమారు 344.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారతదేశంలో 252.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘సుల్తాన్’ విదేశాల్లో 92 కోట్ల గ్రాస్ సాధించింది. బాలీవుడ్ లో మొదటి వారంలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ఘనతను ‘సుల్తాన్’ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment