తాజా వార్తలు

Tuesday, 12 July 2016

ప్రభుత్వానికి, పార్టీకి సమన్వయం కోసమే సమన్వయ సంఘం ఏర్పాటు..


ప్రభుత్వానికి, పార్టీకి సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన సమన్వయ సంఘం తొలిభేటీ మంగళవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం కోసం పలువురు మంత్రులు, పార్టీ నేతలతో కలిసి 10 మంది సభ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొన్ని రోజుల క్రితం కమిటీ ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వం తరపున మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, పార్టీ తరపున కళా వెంకట్రావు, నారా లోకేశ్‌ సభ్యులుగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సరైన సమాచారం ప్రజల్లోకి వెళ్లడం లేదనియ భావించిన చంద్రబాబు ఈ సంఘాన్ని ఏర్పాటుచేశారు. 

ఈరోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి సభ్యులతో పాటు 30 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు.
« PREV
NEXT »

No comments

Post a Comment