తాజా వార్తలు

Sunday, 3 July 2016

విజయవాడలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ…!

విజయవాడలో ఆలయాల కూల్చివేత వివాదం రాజుకుంటోంది… కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా రెండు ఆలయాలను కూల్చివేశారు అధికారులు. ఆలయాల తొలగింపు ప్రదేశాలను బీజేపీ నేతలు పరిశీలించారు… దీంతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వివాదానికి తెరలేసింది.

అధికారులు కూల్చివేసిన ఆలయాలను పరిశీలించిన తర్వాత బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ను… టీడీపీ నేతలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరలు… బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది… పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment