తాజా వార్తలు

Tuesday, 12 July 2016

డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేయాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేయాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన మాటలు విని డ్వాక్రా మహిళలు దారుణంగా మోసపోయారని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రుణాలు చెల్లించాల్సిందిగా డ్వాక్రా గ్రూపులకు నోటీసులు అందుతున్నాయని, చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు రుణాలను చెల్లించనందు వల్లే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. నోటీసులు అందుకున్న మహిళలు తాము దొంగలమా? అని ఆందోళన చెందుతున్నారని, వారిని తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment