తాజా వార్తలు

Friday, 8 July 2016

దివంగత మాజీ సీఎం వై.ఎస్‌కు నివాళి…

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్‌ తనయుడు, వైసీపీ అధినేత జగన్‌.. వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డికి నివాళి అర్పించారు… జగన్‌తోపాటు వైఎస్‌కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు వైఎస్‌కు నివాళి అర్పించారు. తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు నుంచి ప్రధానంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాడు జగన్ ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమం మొదలుపెట్టి పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.. వైసీపీ ముఖ్యంగా తన సొంత జిల్లాలో పార్టీ ఫిరాయింపులు అడ్డుకోవటానికి కౌంటర్ చర్యలు తీసుకుంటోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment