తాజా వార్తలు

Sunday, 28 August 2016

టీచర్‌గా మారిన వివాదాల హీరో

మెంటలోడు బుద్దిమంతుడయ్యాడు. పాఠాలు కూడా చెబుతున్నాడు. జైలుకెళ్లాక తిక్కకుదిరిందేమో, అక్కడి వాతావరణం అతన్ని మార్చేసిందేమో. ఇంతకీ ఎవరా మెంటలోడనుకుంటున్నారా? అదేనండి ఒకటి రెండు సినిమాల్లో నటించి హీరో అని ఫోజుకొట్టిన ఉదయ్ కిరణ్. ఆమధ్య ఓ హోటల్లో హంగామా చేసి నానా బీభత్సం సృష్టించాడు అతగాడే.

జుబ్లిహిల్స్ లోని ఓ హోటల్లో హంగామా చేసి చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు ఉదయ్‌ కిరణ్‌. అయితే అక్కడ అతడి పిచ్చి చేష్టలకు అవాక్కైన జైలు అధికారులు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించారు. కొద్ది రోజులు చికిత్స చేశాక, జైలుకు తిరిగొచ్చాడు ఉదయ్. ఇప్పుడు అతడిలో చాలా మార్పు గమనించారు. నిన్నటిదాకా రౌడీ ఉదయ్ గా పేరు తెచ్చుకున్న అతగాడు పాఠాలు చెప్పే టీచర్ అవతారమెత్తాడు. తాను ఉంటున్న కృష్ణా బ్యారక్ లో 20 మంది రిమాండ్ ఖైదీలకు చదువు చెబుతున్నాడు ఉదయ్ కిరణ్‌.

తెలుగు, హిందీ , ఇంగ్లీష్ భాషల్లో తోటి ఖైదీలకు పాఠాలు చెబుతున్నాడు డిగ్రీ పూర్తి చేసిన ఉదయ్. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మద్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటల దాకా నిరక్షరాస్యులైన రిమాండ్ ఖైదీలకు చదువు చెబుతున్నాడు. ఇప్పుడు ఇతగాడి ఉపాధ్యాయుడి అవతారం చూసి జైలు అధికారులు సిబ్బందే కాదు, తోటి ఖైదీలు చూసి ఆశ్చర్యపోతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment