తాజా వార్తలు

Monday, 3 October 2016

పట్టాలు తప్పి జీలం ఎక్స్‌ప్రెస్‌… ముగ్గురికి గాయాలు…

పంజాబ్‌లో రైలు ప్రమాదం జరిగింది. లుథియానా సమీపంలో జీలం ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. దీంతో 10 బోగీలు పక్కకు జరిగిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పుణెకు వెళుతుండగా ఈ ప్రమాదం జరగగా, సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం తరువాత అదే రూట్లో రానున్న 4 రైళ్లను కాన్సిల్‌ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment