తాజా వార్తలు

Sunday, 16 October 2016

గోవింద, శిల్పాశెట్టిలను కోర్టుకు తీసుకురండి…

20ఏళ్ల క్రితం నమోదైన పరువు నష్టం కేసులో ఇప్పుడు కోర్టుకు హాజరుకావల్సిందిగా బాలీవుడ్ నటులు గోవిందా, శిల్పాశెట్టిలకు జార్ఖండ్ లోని పాకూర్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 18న ఈ ఇద్దరూ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే 1996లో విడుదలైన ‘ఛోటే సర్కార్’ సినిమాలో గోవిందా, శిల్పా నటించగా, అందులో బీహార్, ఉత్తరప్రదేశ్ ను కించపరిచే విధంగా ఓ పాటను చిత్రీకరించారని ఆరోపిస్తూ స్థానిక న్యాయవాది ఒకరు కేసు వేశారు.
ఇందులో గోవిందా, శిల్పాతో పాటు గాయకులు, దర్శకుల పేర్లను యాడ్‌ చేశాడు. అయితే అప్పుడు జార్ఖండ్, బీహార్ లో భాగంగా ఉండేది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగా, గతంలో ఈ విషయమై విచారణకు పలుమార్లు ఆదేశించినా ఎవరూ హాజరుకాలేదు. దీంతో తాజాగా మరోసారి ఆ నటీనటులను కోర్టుకు తీసుకురావాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది కోర్టు.
« PREV
NEXT »

No comments

Post a Comment