తాజా వార్తలు

Wednesday, 5 October 2016

కేసీఆర్ సర్పంచ్‌గా మాత్రమే గెలుస్తారు

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోతారని, ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌గా మాత్రం గెలుస్తారని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఎవరు సంతోషంగా లేరన్నారు. వైఎస్‌ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును గడగడలాడించారని, త్వరలోనే కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే వస్తుందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment