తాజా వార్తలు

Monday, 3 October 2016

ఆలియా కాదయా..శ్రీదేవి తనయ!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. మొన్నటికి మొన్న మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ సినిమాలో హీరోయిన్‌గా ముందు జాహ్నవి కపూర్‌ను సంప్రదించారని గాసిప్‌లు హల్‌చల్ చేశాయి. లేటెస్ట్ బాలీవుడ్ అప్‌డేట్ ఏంటంటే నిజంగానే జాహ్నవి త్వరలో మేకప్ వేసుకోనుందట. వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ‘శిద్దత్’ అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 ఇందులో నాయికగా ఆలియా భట్ నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ, కరణ్ జోహార్ శ్రీదేవి కుమార్తెను పరిచయం చేయాలనుకుంటున్నారట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఆలియాను ఇంట్రడ్యూస్ చేశారు జోహార్. యంగ్ టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేయడంలో కరణ్ స్పెషలిస్ట్. అందుకే, శ్రీదేవి అంగీకరించారట. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన ‘మీర్జ్యా’ ప్రీమియర్ షోలో పాల్గొన్న జాహ్నవి పైనే అందరి కళ్లూ. ఫిజిక్ చూస్తుంటే, హీరోయిన్‌గా అరంగేట్రం చేయడానికి జాహ్నవి రెడీ అవుతోందనిపిస్తోంది కదూ...!
« PREV
NEXT »

No comments

Post a Comment