తాజా వార్తలు

Sunday, 16 October 2016

రజినీని కలవడం ఆనందంగా ఉంది…

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను థాయ్‌లాండ్‌ యువరాణి మామ్ లుయాంగ్ రాజాధరశ్రీ జయంకుర కలిశారు. దాదాపుగా అరగంటకు పైగా వీరిద్దరు మాట్లాడినట్లు సమాచారం. ఇందులో పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’లోని పలు సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె రజినీని ప్రత్యక్షంగా కలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ దేశంలో కూడా రజనీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రజినీతో తెలిపినట్లు సమాచారం. ఈ ఇద్దరి సమావేశంపై రజనీ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment