తాజా వార్తలు

Monday, 21 November 2016

బ‌న్ని ఇంట అదృష్టల‌క్ష్మి…

అల్లు వారింటికి అదృష్టల‌క్ష్మి వెతుక్కుంటూ వ‌చ్చింది. బన్ని- స్నేహారెడ్డి జంట‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది. పండంటి ఆడ‌బిడ్డ రాక‌తో ఆ ఇంట ల‌క్ష్మీ క‌ళ వ‌చ్చిన‌ట్టే. ఈ జంట‌కు ఆయాన్ తొలి బిడ్డ. 4 ఏప్రిల్ 2014న ఆయాన్ జ‌న్మించాడు. ఇప్పుడు ఆడ‌బిడ్డ అల్లు వారి ఇంట అడుగుపెట్టింది.
ఆయాన్ జ‌న‌నంతోనే బ‌న్ని వ‌రుస స‌క్సెస్‌ల‌తో తారాప‌థంలోకి దూసుకెళ్లి ఏకంగా 100 కోట్ల క్లబ్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు కూతురు రాక‌తో మ‌రింత స‌క్సెస్‌ఫుల్ కెరీర్‌ని ఆస్వాదిస్తాడ‌న‌డంలో సందేహ‌మే లేదు. బిడ్డొచ్చిన వేళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.., “బ్లెస్డ్ విత్ బేబి గాళ్‌. సో హ్యాపీ, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. థాంక్స్ ఫ‌ర్ ఆల్ ది విషెస్‌.. ల‌క్కీ మీ”అంటూ ట్వీటాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment