తాజా వార్తలు

Monday, 21 November 2016

టీఆర్ఎస్ సర్కార్ ను నిలదీయాలి


టీఆర్‌ఎస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, ప్రజాసమస్యలను విస్మరించిన రాష్ట్ర సర్కార్‌ను నిలదీసేం దుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  జి.మనో హర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రుణమాఫీ అని రైతులకు సీఎం ఆశలు కల్పించారని, కానీ వడ్డీ కూడా మాఫీ చే యకపోవడంతో అది వారికి గుదిబండగా మారిందన్నారు.

రైతుల పట్ల సీఎంకు కనీస సానుభూతి లేదని, కేంద్రం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వం భాగస్వామి కాలేదన్నారు. ఓయూలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలేద ని,ఫలితంగా న్యాక్ గుర్తింపు ను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పేదలకు రెండు పడకల ఇళ్లు, దళితులకు భూపంపి ణీని విస్మరించిన ప్రభుత్వంపై ఉద్యమాల కు సన్నద్ధం కావాలని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment