తాజా వార్తలు

Saturday, 24 December 2016

సొంత కారణాలతోనే రాజీనామా చేశా…

ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్‌ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీని కలిశారు నజీబ్‌ జంగ్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.., “మోదీ రాజీనామాను వద్దన్నారని, కానీ నా సొంత కారణాలతో పదవికి రిజైన్‌ చెయ్యాల్సి వచ్చిందని ఆయనతో తెలిపినట్లు చెప్పాడు. అలాగే ఈ విషయంలో తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని” తెలిపారు.

“ప్రస్తుతం తన తల్లికి 95 ఏళ్లని, ఆమెతో పాటు తన తనయులు వారి పిల్లలకు సమయం కేటాయించాలని అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గవర్నర్ పదవిలో ఉంటూ సెలవులు తీసుకోవడం సరికాదని, అందుకే రాజీనామాను ఆమోదించాలని మోదీని కోరగానే ఆయన అంగీకరించారని” తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment