తాజా వార్తలు

Saturday, 24 December 2016

సినిమాలోనైనా అమ్మనాన్న కోరిక నెరవేర్చాలి…

అందం, అభినయం ఉన్నప్పటికీ అవకాశాలు తెచ్చుకోవడంలో చాలా వెనుకబడి పోయింది ప్రణీత. దీంతో గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో తనలోకి కోరికను బయటపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. తన తల్లిదండ్రులు ఇద్దరు వృత్తిపరంగా డాక్టర్లు అని, అందుకే తనను కూడా అలానే చూడాలనుకున్నారని, కానీ తాను మాత్రం అనుకోకుండా ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని చెప్పింది ప్రణీత.

ఇక వారి కోరిక మేరకు ఏదైనా సినిమాలో డాక్టర్‌గా కనిపించాలని అనుకుంటున్నట్లు, అలాగైతే కనీసం తెరమీదైనా వారి కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తానని పేర్కొంది. అందుకే ఆ పాత్ర కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఈ బ్యూటీ. మరి ఈ భామ కోరికను తీర్చే డైరక్టర్‌ ఎవరో…?
« PREV
NEXT »

No comments

Post a Comment