తాజా వార్తలు

Saturday, 24 December 2016

విశాల్ అలా వేలు పెట్టే టైపు కాదు

న‌ల్ల‌న‌య్య విశాల్‌కి మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా మాంచి కితాబిచ్చింది. ‘ఒక్క‌డొచ్చాడు’ శుక్రవారం రిలీజైన సంద‌ర్భంగా స‌క్సెస్‌మీట్‌లో మాట్లాడుతూ త‌మ‌న్నా విశాల్‌ని ఆకాశానికెత్తేసింది. “విశాల్ క‌మిట్‌మెంట్ ఉన్న హీరో. అతడు ఆన్‌సెట్స్ ఇన్వాల్వ్‌ అయ్యే తీరు చాలా బావుంటుంది. అయితే అన‌వ‌సర విష‌యాల్లో ఏమాత్రం వేలు పెట్ట‌డు. క్రియేట్‌వ్‌ పార్ట్‌ని అస్స‌లు ట‌చ్ చేయ‌డు. ద‌ర్శ‌కుడి విష‌యాల్లోనూ వేలు పెట్టే టైపు కాదు. సీన్ బెట‌ర్‌మెంట్ కోసం అహ‌ర్నిశ‌లు త‌పించే గ్రేట్ హీరో” అంటూ తెగ పొగిడేసింది త‌మ్మూ. విశాల్ సర‌స‌న మొద‌టిసారి న‌టించినా త‌ను ఎప్ప‌టినుంచో మంచి స్నేహితుడు అని చెప్పింది త‌మ‌న్నా.

అలాగే త‌న నిర్మాత, విశాల్ బెస్ట్ ఫ్రెండ్ జి.హ‌రిని కూడా ఓ రేంజులో పొగిడేసింది. హ‌రి గారు ఎంతో త‌ప‌న ఉన్న నిర్మాత‌. ఆన్‌సెట్స్ వ‌చ్చి సినిమా బెట‌ర్‌మెంట్‌కి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. అవ‌స‌ర‌మైనవ‌న్నీ అందించ‌డం ఆయ‌న ప‌ని. విశాల్‌ని ఎంతో అభిమానించే ఫ్యాన్ కం నిర్మాత‌. అందుకే ప్ర‌తి ప్రొడ‌క్ట్‌ని అంతే క్వాలిటీగా అందిస్తున్నారు.. అంటూ నిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రిని ఆకాశానికెత్తేశారు మిల్కీ బ్యూటీ.

‘ఒక్క‌డొచ్చాడు’ చిత్రం ఒక క‌మర్సియ‌ల్ పంథా సినిమా. ఇది మాస్ ఆడియెన్‌కి బాగా క‌నెక్ట‌వుతుంద‌ని ముందే ఊహించాం. అనుకున్న‌ట్టే చ‌క్క‌ని విజ‌యం సాధించింది అని త‌మ‌న్నా అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment