తాజా వార్తలు

Saturday, 24 December 2016

అస్వస్థతకు గురైన రామ్మోహన్‌రావు, ఐసీయూలో చికిత్స…

అక్రమాస్తుల కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. అయితే ఆయన్ను ఇవాళ విచారించేందుకు ఈడీ సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో రామ్మోహన్‌రావుకు ఉన్నట్లుండి ఇలా అస్వస్థతకు గురవ్వడం విశేషం.
మరోవైపు దాదాపు 3 రోజులుగా రామ్మోహన్‌రావు, అతడి బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment