తాజా వార్తలు

Thursday, 5 January 2017

మోదీ చర్య అనాలోచితం

పెద్ద నోట్లను రద్దుచేసి ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచితంగా వ్యవహరిస్తే, సీఎం కేసీఆర్‌ దానికి మద్దతు నిచ్చి దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది, గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు దానం నాగేందర్‌ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ చార్మినార్‌ వద్ద ప్రారంభమై గాంధీభవన్‌ వరకు సాగింది. ర్యాలీ ముగింపు సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, శాసనమండ లిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, సీనియర్‌ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌ కుమార్‌యాదవ్‌ తదితరులు ప్రసంగిం చారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య అని మొదటిరోజు మా ట్లాడిన కేసీఆర్, ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మద్ధతు పలకడంలో మర్మమేమిటని ప్రశ్నిం చారు. నల్లధనాన్ని అరికడతామని, తీవ్ర వాదం లేకుండా పోతుందని చెప్పిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు.

గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్క రణలతో దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా మా రిందని, ప్రపంచంలో గొప్ప సంపన్న దేశంగా రూపుదిద్దుకునే సమయంలో మోదీ తీసుకున్న అనాలోచిత చర్యతో ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నోట్ల రద్దు వారికి మేలు చేసిందంటూ, ప్రధాని మోసపూరి తంగా మాట్లాడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుపై సీఎం కేసీఆర్‌ రోజుకోరకంగా మా ట్లాడుతున్నారన్నారు. ఇక్కడ దిక్కుమాలిన నిర్ణయం అని.., ఢిల్లీకి పోయి మద్దతును ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నా, మోదీకి కేసీఆర్‌ ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శారద, అనిల్‌కుమార్‌ యాదవ్, బి.వెంకట్‌ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మోదీ మరో తుగ్లక్‌..
జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీ.. మరో తుగ్లక్‌ అని విమర్శించారు. మోదీని మించిన దుర్మార్గుడు, దరిద్రపు ప్రధానమంత్రి ఇంకెవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇంకా మోసం చేసే, మభ్యపెట్టే మాటలను మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేంద్రంలో పెద్ద మోదీ, రాష్ట్రంలో చిన్న మోదీ నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ తినేస్తున్నారని వ్యాఖ్యానించారు. 50 రోజుల్లో అనేకమంది చనిపోయారని, ఇప్పటిదాకా ఎంత నల్లధనం బయటకు వచ్చిందో చెప్పాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. వీహెచ్‌ మాట్లాడుతూ సహారా, బిర్లా కంపెనీల నుంచి ప్రధాని మోదీ తీసుకున్న ముడుపుల సంగతి చెప్పాలన్నారు. అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ గవర్నర్‌ ప్రథమ పౌరునిగా కాకుండా సీఎం కేసీఆర్‌కు చెంచాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
« PREV
NEXT »

No comments

Post a Comment