తాజా వార్తలు

Thursday, 5 January 2017

అమెరికాతో బంధం ఏనాటిదో..!

అమెరికాలో 1965 నాటికి భారత సంతతికి చెందిన ప్రజలు కేవలం 15,000 లోపు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 34 లక్షల వరకూ పెరిగింది. అంతకు ముందు 1946లో చేసిన లూక్–సెలర్ చట్టం ఫలితంగా ఏడాదికి 100 మంది భారత సంతతి వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం మొదలయ్యాక వలసపోయే వారి సంఖ్య పెరిగింది. ఈ కోటా చట్టం తొలగించి, 1965లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ (డెమొక్రాట్) హయాంలో తెచ్చిన ‘ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం’ ఫలితంగా భారత్ నుంచి వలసొచ్చే డాక్లర్లు, ఇంజనీర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990ల్లో వచ్చిన ఐటీ విప్లవం తర్వాత 2000 సంవత్సరం నుంచి భారతీయుల వలస ఎన్నో రెట్లు పెరిగింది.
(చదవండి : డాలర్ డ్రీమ్స్ పై ట్రంప్ వేటు!)

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఏటా దాదాపు 35 వేల మంది విద్యార్థులు అమెరికాలో పీజీ చదువులకు వెళుతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడుతున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం ఇంకా పూర్తిగా తొలగని ఈ పరిస్థితుల్లో.. హెచ్1బీ వీసాలను అర్హులకే ఇస్తామని, ఇండియాలో అమెరికా కంపెనీలు తయారుచేసి పంపే వస్తు, సేవల దిగుమతులపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు చాలా మంది భారతీయులకు గుబులు పుట్టిస్తున్నాయి. అయితే.. ట్రంప్కు ఓటేసిన భారత సంతతి సభ్యులు, దౌత్యనిపుణులు మాత్రం జనవరి 20న అధికారం చేపట్టే రిపబ్లికన్ సర్కారు విధానాలపై దిగులు పడాల్సిన అవసరం లేదంటున్నారు.
(చదవండి : ట్రంప్ నోట రోజుకో మాట)
(చదవండి : 100 మందిలో ఒకరు భారతీయులే!)
అమెరికాకు భారతీయుల వలసలను నిరోధించే చర్యలేమీ తీసుకోరనీ, వాస్తవానికి ఇండియా కంపెనీలకు, ఐటీ నిపుణులకు ఉపకరించే హెచ్1బీ వీసాల సంఖ్య కూడా పెరుగుతుందేగాని తగ్గదని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment