తాజా వార్తలు

Thursday, 5 January 2017

అన్న ఎర్రబెల్లి నేతృత్వంలో వాకౌట్‌

అన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో వాకౌట్‌ చేస్తున్నాం’ అంటూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులను ఆశ్చర్యానికి గురిచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు అంశంపై టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య.. మరికొందరు సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వస్తున్న సందర్భంగా ఎర్రబెల్లి అసెంబ్లీ లాబీల్లో వారికి ఎదురయ్యారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దగ్గరకు రేవంత్‌రెడ్డి వచ్చి ‘అన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోనే వాకౌట్‌ చేస్తున్నాం. ఎర్రబెల్లి మాకన్నా ముందుగానే సభనుంచి బయటకు వచ్చారు. ఆయన బాటలోనే మేము బయటకు వచ్చాం. దొరల నాయకత్వాన్ని కాదనే పరిస్థితి ఇప్పుడుందా’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి ఎర్రబెల్లి సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండిపోయారు.
« PREV
NEXT »

No comments

Post a Comment