తాజా వార్తలు

Saturday, 25 February 2017

కాబినెట్లో మార్పులు చేర్పులు ఇవే అంటా ....!


ఎపిలో మంత్రి పదవులు కోల్పోయేది ఎవరు? కొత్తగా పొందేది ఎవరు అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒక కధనం ప్రకారం ఆరు లేదా ఏడుగురు మంత్రులపై వేటు పడవచ్చు. అందులో కిమిడి మృణాళిని, రావెల కిషోర్ బాబు, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు ,పల్లె రఘునాధరెడ్డి లు ఉండవచ్చని అలాగే మరో మంత్రి నారాయణ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. టిడిపి ఎపి అద్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు మంత్రులు కావచ్చని చెబుతున్నారు. కాగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేరు కూడా ప్రచారంలోకి వచ్చినట్లు కొన్నీ మాధ్యమాలు చెబుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మంత్రులు అయ్యే అవకాశం ఉన్నవారిలో భూమా అఖిల ప్రియ, అమరనాద్ రెడ్డి, సుజయ రంగారావుల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి.తాజాగా టిడిపిలో చేరిన జానీ పేరు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఉండడం విశేషం.వీటిలో కొన్ని మార్పులు ,చేర్పులు పరిస్థితులబట్టి ఉండవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment