తాజా వార్తలు

Saturday, 25 February 2017

అఖిల్ పెళ్లి ఆగిపోవడం వెనుక నాగ్ హస్తం ....!


అక్కినేని అఖిల్, శ్రేయా భూపాల్ ల పెళ్లి ఆగిపోయిందంటూ 'గ్రేట్ ఆంధ్ర' బ్రేక్ చేసిన వార్త సంచలనం సృష్టించింది. దీన్ని ముందుగా జీర్ణించుకోవడానికే మిగిలిన మీడియా చాలా టైమ్ తీసుకుంది. ఎటు వైపు నుంచి ఖండన రాకపోవడంతో, సాయంత్రానికి నిజమే అయి వుంటుందని, ఈ వార్తను ఆయా మీడియాలు అందించడం ప్రారంభించాయి.
శ్రేయా భూపాల్ కి బాగా పొగరు ఎక్కువ అని అదే విధంగా అఖిల్ కి కూడా మాట మీద నిలబడే తత్త్వం లేకపోవడం అసలు కారణాలుగా ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది.నాగార్జున కి ఈ పెళ్లి మీద మొదట నుండి ఇంటరెస్ట్ లేకపోవడం కూడా ఒక కారణం గా చెబుతున్నారు.
నాగార్జున నన్నే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని శ్రేయ అంది అని అందుకు నాగ్ బాగా ఫీల్ అయ్యి కాన్సుల్ అనేశాడు అంటా....!
ఇదిలా వుంటే అఖిల్-శ్రియా భూపాల్ ల వ్యవహారానికి సంబంధించి మరి కొన్ని విషయాలు తెలిసాయి. ఈ పెళ్లికి ఆది నుంచీ నాగార్జున అంత సుముఖం కాదట. అఖిల్ ఈ ప్రస్తావన తెచ్చినపుడు తానే ఓపిగ్గా అఖిల్ తో గంటల కొద్దీ కూర్చుని, 22 ఏళ్ల వయసులో పెళ్లి, పైగా వయసులో బాగా తేడా వున్న అమ్మాయితో, ప్రోస్..కాన్స్ అన్నీ వివరించాడట. కానీ అఖిల్ ససేమిరా అనడంతో, ఈసారి నచ్చ చెప్పే బాధ్యతను నాగ్ చైతన్య మీద పెట్టాడట. చైతూ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడంతో నాగ్ ఓకె చేయక తప్పలేదు. 
పెళ్లిలో ప్రారంభం
అఖిల్ కు శ్రియాకు గొడవలు ఇటీవల జివికే ఇంట జరిగిన పింకీ రెడ్డి (టీఎస్ఆర్ కుమార్తె) కొడుకు పెళ్లిలో ప్రారంభమయ్యాయని వినికిడి. అప్పటి నుంచీ అవి అలా అలా రగులుతూ, ఆఖరికి పీక్ కు వెళ్లాయి. ఇదిలా వుంటే అఖిల్, శ్రియా భూపాల్, ఆమె తల్లి ముగ్గురూ కలిసి పెళ్లి ఏర్పాట్లపై విదేశాలకు వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లినపుడు వున్నట్లుంది ఇద్దరి మధ్యన వాదనలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.
దేని గురించి అన్నది తెలియదు కానీ, ఎయిర్ పోర్టులో పబ్లిక్ గానే ఇద్దరూ కాస్త గట్టిగానే వాదించుకున్నారని తెలుస్తోంది. కానీ శ్రియా తల్లి వారించే ప్రయత్నం ఏమీ చేయలేదని, ఆ సమయంలో అఖిల్ ..బ్రేకప్ చెప్పేసి, గుడ్ బై చెప్పేసి వచ్చేసాడని తెలుస్తోంది. అలా అఖిల్ వెళ్లిపోతున్నా ఇద్దరిలో ఎవరూ వారించలేదని తెలుస్తోంది.
ఇంటికి వచ్చిన తరువాత నాగ్ కు విషయం తెలిసి, ప్యాచ్ అప్ కోసం ట్రయ్ చేసినా ఫలితం లేకపోయిందట. ఇరు వర్గాలు సమావేశమైనా అఖిల్-శ్రియ మాత్రం ఎంత పిలిచినా రాలేదని తెలుస్తోంది. 
మొదట్నించీ అంతే?
అఖిల్ ది మొదట్నించీ దుందుడుకు వైఖరే అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం. మొదటి సినిమా విషయంలో త్రివిక్రమ్, కొరటాల శివ ల టైమ్ దొరికే వరకు ఆగుదాం అని నాగ్ ఎంత చెప్పినా కూడా అఖిల్ వినలేదని తెలుస్తోంది. నిర్మాత, డైరక్టర్, కథ రెడీగా వున్నారు..సినిమా స్టార్ట్ చేయాల్సిందే అని పట్టుపట్టాడట. ఫలితం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి విషయంలో ఇలా. 
పాపం, ఇండస్ట్రీలో నాగ్ అన్ని విధాలా పెరఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ మాత్రం ఇలా. అందుకే ఈ సంఘనటను జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికీ అన్నీ మర్చిపోయి రాజుగారి గది 2 షూట్ కోసం రెండు రోజులు వెళ్లాడు. అయినా ఫోన్ లు, మెసేజ్ లు అన్నీ చాలా డిస్ట్రబ్ చేయడంతో ఇక వెళ్లలేదని తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన అపాయింట్ మెంట్ ల్లో చాలా వరకు క్యాన్సిల్ చేస్తూ, తప్పని సరి అన్నవి మాత్రం ఓకె చేస్తున్నాడట నాగ్.
« PREV
NEXT »

No comments

Post a Comment