తాజా వార్తలు

Saturday, 25 February 2017

జడ్జీలకు ఇచ్చిన విందులో పోలీసులును కూడా అనుమతిలేదు ఎందుకు బాబూ?టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏం చేసినా ప్రత్యేకమనే చెప్పాలి. తాను చేయాలనుకున్న పనిని పకడ్బందీగానే కాకుండా.. సదరు పని జనానికి తెలియకూడదని భావిస్తే... దానికి సంబంధించిన చిన్న విషయం కూడా బయటకు పొక్కదు. మొత్తం వ్యవస్థనే మార్చేసి... అక్కడికి చీమ కూడా చొరబడకుండా ఆయన పకడ్బందీ ఏర్పాట్లు చేసేస్తారు. నిన్న రాత్రి సుప్రీంకోర్టు - హైకోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులకు చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. విజయవాడలో నిన్న జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ - జస్టిస్ మదన్ బీ లోకూర్ లతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు విజయవాడ వచ్చారు. 

గురువారం రాత్రే విజయవాడ చేరుకున్న న్యాయమూర్తులకు చంద్రబాబు కృష్ణా నదీ తీరాన ఉన్న తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ విందుకు అంతగా ప్రత్యేకత ఏమీ లేకున్నా... నిన్న రాత్రి కృష్ణా నదీ తీరంలోని పున్నవి ఘాట్ లో చంద్రబాబు ఇచ్చిన విందు అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే... ఈ విందు జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు ఒక్కరిని కూడా అనుమతించలేదు కదా... పున్నవి ఘాట్ లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెలవు దొరికేసింది. ఎంపిక చేసిన ఉద్యోగులను మాత్రమే అక్కడ ఉంచేసిన పోలీసులు మిగిలిన వారందరిననీ అక్కడి నుంచి పంపేశారు. ఇక నిన్న శివరాత్రి సందర్భంగా పున్నమి ఘాట్ లో  స్నానం చేసేందుకు వచ్చిన భక్త జనాన్ని కూడా పున్నమి ఘాట్ ఛాయలకు కూడా రానివ్వకపోవడం విశేషం. 

ఇదంతా ఒక ఎత్తైతే.. విందులో చంద్రబాబు చేసిన హంగామా మరో ఎత్తు అనే చెప్పాలి. న్యాయమూర్తుల విందుకు చంద్రబాబే స్వయంగా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేయించారట. జడ్జీలు పున్నమి ఘాట్ కు చేరుకునే  సమయానికంటే చాలా ముందుగా అక్కడికి చేరుకున్న చంద్రబాబు... అక్కడి ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పరిశీలించారు. ఇంకా మిగిలిపోయిన ఏర్పాట్లను చంద్రబాబు స్వయంగా పూర్తి చేయించారు. విందులో వడ్డించాల్సిన ఆహార పదార్థాల నుంచి విందు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లన్నింటినీ కూడా చంద్రబాబు పరిశీలించారట. ఏర్పాట్లలో కనిపించిన చిన్న చిన్న లోపాలను సవరించే క్రమంలో అధికారులకు ఆదేశాలు ఇస్తూ చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదట. 

ఇక పున్నమి ఘాట్ కు చేరుకున్న న్యాయమూర్తులకు చంద్రబాబు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. రెండు గంటలకు పైగా జరిగిన విందు సమయంలో ఏ ఒక్క పురుగును కూడా అక్కడికి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదట. ఇక ఏ కార్యక్రమం చేపట్టినా.. దానిపై భారీగా ప్రచారం చేసుకునే చంద్రబాబు.. జడ్జీలకు ఇచ్చిన విందుకు సంబంధించి అసలు మీడియాకు సమాచారమే ఇవ్వలేదట. ఇకవేళ జడ్జీల ప్రైవసీని కారణంగా చూపినప్పటికీ... కనీసం పత్రికా ప్రకటనో. లేదంటే ఫొటోలో విడుదల చేయాల్సి ఉన్నా... అది కూడా చేయలేదట. దీంతో అసలు జడ్జీలకు చంద్రబాబు ఎలాంటి విందు ఇచ్చారోనని అంతా గుసగుసలాడుకుంటున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment