తాజా వార్తలు

Tuesday, 7 March 2017

మహేష్ సెట్స్ లోకి చిరు వెళ్లడం వెనుక అసలు రహస్యం తెలుసా ....!


మహేష్-మురుగదాస్ మూవీ సెట్ లో ఒక్కసారిగా పండగ వాతావరణం కనిపించింది. అనుకోని అతిథిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. సీరియస్ గా షూటింగ్ చేసుకుంటున్న టైమ్ లో ఖైదీ ఎంటరై అందర్నీ ఆనందపరిచాడు. అతడే చిరంజీవి. మహేష్ షూటింగ్ స్పాట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన చిరంజీవి మూవీ మేకింగ్ ను గమనించారు. మహేష్ నటించిన ఇంట్రోసాంగ్ చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ రేర్ ఫీట్ జరిగింది. స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మహేష్ బాబుపై ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు. అదే స్టూడియోలో తన టీవీ కార్యక్రమానికి సంబంధించిన షూట్ చేస్తున్నారు చిరంజీవి. షూటింగ్ గ్యాప్ లో వెళ్లి మహేష్ ను పలకరించారు చిరంజీవి. అయితే ఇంత సడెన్ గా మహేష్ మూవీ సెట్స్ లో చిరంజీవి ప్రత్యక్షం కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. 
దర్శకుడు మురుగదాస్, చిరంజీవికి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో మురుగదాస్ తో స్టాలిన్ సినిమా చేశారు చిరు. రీసెంట్ గా చిరు చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా కూడా... తమిళ్ లో మురుగదాస్ తీసిన కత్తి సినిమాకు రీమేకే. ఈ సినిమా తర్వాత మళ్లీ కథలు దొరక్క ఇబ్బందిపడుతున్నారు చిరంజీవి. అందుకే ఇప్పటివరకు 151వ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. అందుకే మహేష్ బాబు సెట్స్ కి వెళ్లి మరీ మురుగదాస్ తో ఏకాంతంగా చర్చలు జరిపారట చిరంజీవి.
« PREV
NEXT »

No comments

Post a Comment