తాజా వార్తలు

Tuesday, 7 March 2017

జలీల్ ఖాన్, పవన్‌ కల్యాణ్ మీదే పోటీ చేస్తాననడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ...!


ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మరోసారి మాటల్లో తొడకొట్టారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు పలకరించగా.. జలీల్ ఖాన్ తన బలం గురించి చెప్పారు. తనకు ఎన్నికలంటే భయం లేదని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ మీద పోటీ చేసినా తాను గెలుస్తానన్నారు. చంద్రబాబు ఐడియాలు ఎవరికీ రావన్నారు. బాబు ముందు మోడీ కూడా సరిపోరన్నారు. అడవిలో అసెంబ్లీ కట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి అవడం కంటే ఎమ్మెల్యేగా ఉండడమే మంచిదన్నారు. వైసీపీ గ్రాస్ రూట్‌లో బలపడితే ఆ పార్టీకి మంచిదన్నారు. తాను మంత్రి పదవి కోసం పార్టీ మారలేదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు. లాబీల్లో అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాను జలీల్‌ ఖాన్‌ పలకరించారు. టీడీపీలోకి ఎప్పుడు వస్తావ్ అంటూ ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందించకపోవడంతో వైసీపీలో ఉంటే నీవు కూడా రోజాలాగా ఇబ్బంది పడాల్సి వస్తుందని జలీల్‌ ఖాన్ వ్యాఖ్యానించారు. ఫిజిక్స్‌లో బీకాం చదవడంపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా జలీల్‌ ఖాన్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు
« PREV
NEXT »

No comments

Post a Comment