తాజా వార్తలు

Thursday, 13 April 2017

‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ విడుదల..!

క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్కర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ‘స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్’ అనే సినిమా తెరకెక్కుతున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. కాగా, మే 26న ఈ సినిమాను విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 


ఇక క్రికెట్ దేవుడు సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే సచిన్ బాల్యం, క్రికెటర్ గా ఎలా మారాడు. తర్వాత అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యక్తి గత జీవితం గురించి చాలా మందికి తెలువదు. వీటినే ప్రధానంగా తీసుకుని సచిన్ తన జీవితాన్ని తెరపైకి తీసుకురానున్నారు దర్శకుడు జేమ్స్ అరస్కైన్. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో సచిన్ గురించి కొన్ని అంశాలను చూపిస్తూ సినిమాపై ఎలా ఉండబోతోందో చూపించాడు. ఏఆర్ రెహ్మన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను రవి భగ్ చంద్కా, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు క్రికెట్ దేవుడిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment