తాజా వార్తలు

Thursday, 6 April 2017

నా భార్యకు ముందే పెళ్లయింది!

నటుడు ప్రశాంత్ వైవాహిక జీవితం వివాదాస్పదంగా మారింది. తన భార్యతో విడాకులు తీసుకోవడం వెనుక కారణాన్ని ఆయన వివరించారు.
నా భార్యకు అంతకుముందే వేణు ప్రసాద్ అనే వ్యక్తితో పెళ్లైంది. ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టి నన్ను మోసం చేసింది. నాతో పెళ్ళైన తర్వాత కూడా, ఆవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నా భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు పొందాను అని ప్రశాంత్ వివరించారు.

ఓ రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ‌కాల్ చేసి గృహలక్ష్మికి మరో వ్యక్తితో ఇదివరకే పెళ్లయింది అని చెప్పడంతో గుండె పగిలింది. ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపాను. ఆ బాధను తట్టుకోలేక గృహలక్ష్మి పెళ్లి వివరాలు సేకరించేందుకు చాలా ప్రభుత్వ వెబ్‌సైట్లు వెతికాను అని ప్రశాంత్ పేర్కొన్నారు.

కాగా ప్రశాంత్ ఆరోపణలను గృహలక్ష్మి ఖండించింది. ప్రశాంత్‌ను నేను మోసం చేయలేదని పేర్కొన్నది. విడాకుల తీర్పును పైకోర్టులో సవాల్ చేసింది. అయితే హైకోర్టు గృహలక్ష్మి వాదనను తోసిపుచ్చి. ఆమె నుంచి ప్రశాంత్ విడిపోవడమే కరెక్టని తీర్పునిచ్చింది అని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment