తాజా వార్తలు

Wednesday, 12 April 2017

అక్షయ్‌కు రోజుకు రూ.2 కోట్లట

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడుగా నటిస్తున్న ‘2.0’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ చిత్ర పరిశ్రమలో అక్షయ్‌ నటిస్తున్న తొలి చిత్రమిది కావడం విశేషం. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తన పాత్రకు అక్షయ్‌ రజనీ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారట. రోజుకు రూ. 2 కోట్లు నిర్మాతలు అక్షయ్‌కు పారితోషికంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అక్షయ్‌ ప్రతిరోజు చాలా మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఆయన తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు మేకప్‌ వేసుకోలేదు. ఇందులో అక్షయ్‌ దాదాపు 12 పాత్రల్లో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నారు.
2010లో విడుదలైన ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘2.0’లో అమీజాక్సన్‌ కథానాయికగా నటించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment