తాజా వార్తలు

Wednesday, 12 April 2017

బికినీకి మాత్రం షరతు

అమృతా సింగ్. ఒకప్పటి బుల్లితెర, వెండితెర నటి. ఈమె నటనకు దూరమై సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి సారా అలీఖాన్ అనే కుమార్తె ఉంది. ఈమెను వెండితెరకు పరిచయం చేసేందుకు అమృత ఉత్సాహం చూపుతోంది. అయితే, ఆమె స్క్రీన్ లుక్ విషయంలో మాత్రం పలు పరిమితులు పెడుతోంది. ఇంకా సారాను తెరకు పరిచయం చేయకముందే.. ఒప్పంద పత్రాల మీద సంతకాలు కాకముందే.. అమృత పెడుతున్న షరతులతో నిర్మాతలే కాదు.. హీరోలు సైతం బిత్తరపోతున్నారట. 
 
అయితే, అమృతా సింగ్ మాత్రం... కుమార్తె విషయంలో బికినీధారణకు షరతు పెడుతోందట. సారాను బికినీలో చూపడానికి వీల్లేదని ఈమె స్పష్టం చేస్తోందట. ప్రస్తుతం సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి చర్చలు జరుగుతున్న దశలో, కరణ్ జోహార్ సినిమాతో సారా తెరకు పరిచయం కానున్నదనే వార్తల నేపథ్యంలో అమె షరతులు ఆసక్తికరంగా ఉన్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment