తాజా వార్తలు

Sunday, 23 April 2017

హోదా అడగలేదు.. ప్యాకేజీ మాత్రమే కోరాను.

నీతి ఆయోగ్‌ సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పేడు ఘటన, సోషల్‌ మీడియా, ఏపీ ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారు.

'సోషల్‌ మీడియాలో అసభ్యంగా ఫొటోలు పెట్టడం తప్పు. మీపై వేసే ఆ ఫొటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారు! అందుకే సోషల్‌ మీడియాలో బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి'అని చంద్రబాబు అన్నారు.

'కీలకమైన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని అడిగారా..?' అన్న విలేకరుల ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చంద్రబాబు.. 'హోదా అడగలేదు.. ప్యాకేజీ అమలు చేయమని మాత్రమే కోరాను'అని చెప్పారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని, అయిదో స్థానంలో దిగువన ఉన్నామని, రూ.16 వేల కోట్ల లోటు ఉందని, విభజనవల్లే ఈ సమస్యలు తలెత్తినందున కేంద్ర ప్రభుత్వ సాహాయాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. రైల్వే జోన్‌ ఇవ్వాలని ప్రధానిని అడిగినట్లు కూడా చంద్రబాబు చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment