తాజా వార్తలు

Saturday, 22 April 2017

లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు నారా లోకేశ్‌, అమర్‌ నాథ్‌, మాజీ మంత్రి గొజ్జల గోపాలకృష్ణా రెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్పా మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. మీ వల్లే మావాళ్ళు చనిపోయారంటూ శాపనార్ధాలు పెట్టారు. మీ వెనుకున్న వాళ్లు మావాళ్ళను చంపేసారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు.

 10 లక్షలు ఇస్తాను నా భర్తను తెచ్చిస్తారా అంటూ మృతిచెందిన వ్యక్తి భార్య లోకేష్, బొజ్జలను గట్టిగా నిలదీసింది. స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహించారు. శ్రీకాళహస్తికి రోడ్డు నిర్మాణం కూడా సరిగా లేదని మండిపడ్డారు.బొజ్జల అనుచరుల వల్లే తమ ఊరు వల్లకాడుగా మారిందంటూ మండిపడ్డారు. అమరావతికి రోడ్లు వేయటం కాదు తమ ఊర్లకు కూడా రోడ్లు వేయాలంటూ డిమాండ్ చేసారు. అసలు మంత్రులను ఎవ్వరినీ జనాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దాంతో వీరి ధాటికి, ఆగ్రహానికి  తట్టుకోలేక లోకేష్, బొజ్జలతో పాటు మంత్రులు నారాయణ, అమరనాధ రెడ్డిలు చివరకు వెనుదిరిగారు.
« PREV
NEXT »

No comments

Post a Comment