తాజా వార్తలు

Thursday, 13 April 2017

కట్టుకథ అల్లి ట్రంప్‌ దాడి చేయించారు

‘రసాయన దాడి’ అనే కట్టుకథను ఉపయోగించుకుందని తమ దేశంపై అమెరికా క్షిపణి దాడులను చేసిందని సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తీవ్రంగా మండిపడ్డారు. నూటికి నూరుశాతం అది కట్టుకథేనని, కేవలం తమ దేశం మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ మొత్తం కథను అల్లేసిందని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలన్నింటినీ సిరియా సైన్యం ఎప్పుడో విడిచిపెట్టేసిందని చెబుతూ.., అమెరికా దాడి చేసినంత మాత్రాన తమ సైనిక సామర్థ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు.
అయితే సిరియాలో జరిగిన రసాయన దాడిలో ఇప్పటివరకు 87 మంది మరణించగా వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో మృతుల, క్షతగాత్రుల ఫొటోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కానీ సిరియా మాత్రం అసలు తాము ఈ తరహా దాడులే చేయలేదని చెబుతుండగా రష్యా కూడా దాన్ని సమర్థించింది. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న వీడియోలలో వాస్తవం ఎంత ఉందో తెలియదని, ఆ పిల్లలు నిజంగా ఖాన్‌ షైఖుమ్‌ ప్రాంతంవారో కాదో ఎలా చెప్పగలమని, ఇప్పుడు చాలా వరకు ఫేక్‌ వీడియోలు ఉంటున్నాయని ఆయన తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment