తాజా వార్తలు

Wednesday, 12 April 2017

మమతాబెనర్జీ తల నరికితే రూ.11 లక్షలు!

పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం తల నరికి తెచ్చిన వారికి రూ. 11లక్షల రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్‌ వర్షనీ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అసలేం జరిగిందంటే..
మంగళవారం హనుమాన్‌జయంతి సందర్భంగా పశ్చిమ్‌బంగాలోని బీర్భమ్‌ జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఇక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన యోగేశ్‌.. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ. 11లక్షల బహుమతి ఇస్తాను. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదు. ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతిస్తారు. ఇఫ్తార్‌ విందులు చేస్తారు’ అని యోగేశ్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానికంగా పెను దుమారం రేగింది.
« PREV
NEXT »

No comments

Post a Comment