తాజా వార్తలు

Tuesday, 11 April 2017

బీజేపీ ఎఫెక్ట్ : గులాబీ దళపతి ఎలర్ట్

తెలంగాణలో కమలం విరబూయాలని ప్రయత్నిస్తుంటే కారు దూసుకుపోవాలని ట్రై చేస్తోంది. కొన్ని కీలక నియోజక వర్గాలను టార్గెట్ చేసి పాగా వేయాలని కమలం కలలు కంటుంటే ఎలర్ట్ అయిన కారు కమలం ఎత్తులకుపై ఎత్తులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితులు చేయిదాటకూడదని ప్లాన్ వేస్తోంది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దక్షిణాదిన పాగా వేయాలని బలంగా భావిస్తోంది. అందుకే చాపకింద నీరులా సైలెంట్‌గా తన పని తాను చేసుకొని పోతోంది. తెలంగాణాలో కనీసం అయిదు ఎంపీ సీట్లైనా గెలుచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు కమలనాథులు. బీజేపీ టార్గెట్‌ చేసిన ఎంపీ స్థానాల్లో కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌ కూడా ఉన్నట్లు  సమాచారం. నిజామాబాద్‌ లో గెలుపు కోసం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని వినియోగిస్తున్నారన్న సమాచారం తోగులాబీ దళపతి ఎలర్ట్ అయ్యారు. అయితే బీజేపీ తన మాస్టర్‌ ప్లాన్‌ని సైలెంట్‌‌గా అమలు చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా అభ్యర్థులను ఖరారు చేసేలా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ అగ్రనేతలు ఏం చేసినా సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కి శ్రీరామ రక్షని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ కూడా తక్కువ తినలేదు. బీజేపీ వ్యూహ‌ల‌కు ప్రతి వ్యూహ‌లు పన్నుతోంది. ఒక్కసారిగా అటాక్ చేయ‌కుండా ప‌రోక్షంగానే బిజెపికి చెక్ పెట్టాల‌ని భావిస్తోంది. రెండేళ్ల ముందుగా రాజ‌కీయ స‌భ‌లు పెట్టడం కూడా టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా క‌నిపిస్తుంది. బిజెపికి ఎక్కడ ప‌ట్టుందో అక్కడ టిఆర్ఎస్ ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాలు చేప‌ట్టడంతో పాటు గ్రేట‌ర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలున్న నియెజ‌క‌వ‌ర్గాల్లో కూడా పార్టి క్యాడ‌ర్‌ను ప్రోత్సహిస్తోంది. బీజేపీ ఎలాంటి స్ట్రాట‌జితో ముందుకెళ్తుందో చూసాకే ఓపెన్ ఫైట్‌కు సిద్దం కావాల‌ని గులాబి బాస్ భావిస్తున్నట్లు స‌మాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment