తాజా వార్తలు

Monday, 24 April 2017

టీడీపీ పై కమలం వ్యూహాత్మక ఎత్తుగడలు

ఆంద్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో పది నుంచి పదిహేను లోక్ సభ సీట్లు, నలభై నుంచి ఏభై అసెంబ్లీ సీట్లు కోరాలని బిజెపి భావిస్తోందట. బిజెపి వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న పట్టును అదే విదంగా కొనసాగించి, వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం ద్వారా బిజెపి తన ఆదిపత్యాన్ని చాటుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

చంద్రబాబు కూడా పది లోక్ సభ సీట్ల వరకు ఇవ్వక తప్పదని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టిడిపి ఎమ్.పి అభ్యర్ధులు కొందరికి ఈసారి బిజెపి ఎక్కువ సీట్లు అడుగుతోందని, అందువల్ల ఎమ్మెల్యే గా పోటీచేయడానికి సిద్దంగా ఉండాలని చెప్పారని అంటున్నారు.ఎమ్మెల్యే సీట్ల విషయంలో కొంత రాజీ ఉన్నా, పది కి తగ్గకుండా లోక్ సభ సీట్లలో పోటీచేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య కనుక పెరిగితే అప్పడు నలభై వరకు బిజెపికి ఇవ్వవలసి వస్తుందన్న ప్రచారం కూడా ఉంది.ఇవన్ని ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పటికే తమ వాంచను బిజెపి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారని అంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment