తాజా వార్తలు

Friday, 7 April 2017

జేసీ వ్యాఖ్యలపై బొత్స అభ్యతరం

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ.టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ వ్యవస్థకు కళంకం తెస్తున్నారని, జేసీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని బొత్స సూటిగా ప్రశ్నించారు. అదే విషయాన్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, స్పీకర్ల అధికారాలకు పరిమితి ఉండాలని బొత్స అన్నారు.కాగా  ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment