తాజా వార్తలు

Thursday, 13 April 2017

నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా?

రాజ్యసభలో ప్రత్యేకహోదాపై చర్చ జరినప్పుడు అధికార పార్టీ ఎంపీలు తమ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం మాట్లాడితే ఏం కొంప మునుతుందోనని భయపడ్డారని వ్యాఖ్యానించారు. తాము మాట్లాడితే కుంభకోణాలు బయట పడతాయని నోళ్లు మూసుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రత్యేకహోదా గురించి తెలంగాణ, జాతీయ పార్టీలు ఎంపీలు మాట్లాడినా.. టీడీపీ ఎంపీలు మాత్రం నోరు మెదపలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించినా మిన్నకుండిపోయారని దుయ్యబట్టారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. రైతులను పట్టించుకోవడంలో టీడీపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. అన్నదాతల కష్టాల గురించి మూడు నాలుగు నెలలుగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు గొంతెత్తున్నా సర్కారు ఏమాత్రం స్పందించలేదన్నారు. మిరప రైతుల ఇక్కట్లు ప్రభుత్వానికి పట్టడం లేదని వాపోయారు.

రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు హామీయిచ్చి, విస్మరించారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు రాష్ట్రానికి ఒరిగిందేమిటని నిలదీశారు. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి ఈ మూడేళ్లలో ఈ రాష్ట్రానికి ఏవిధమైన మేలు జరగలేదని బొత్స సత్యనారాయణ అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment