తాజా వార్తలు

Wednesday, 12 April 2017

నిఘా కెమెరాలు నిద్దరోతున్నాయి

నిఘా కెమెరాలు నిద్దరోతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోడం మానేశారు..  ఇంకేముంది దోచుకున్న వాడికి దోచుకున్నంత.. వరంగల్ లో దొంగలు చెలరేగిపోతున్నారు. స్మార్ట్ సిటీలోనే ఈ పరిస్థితులుంటే ఇక మామూలు నగరాల సంగతేంటి?
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించిన జాబితాలో తెలంగాణలోని వరంగల్ సిటీ ఒకటి.
స్మార్ట్ ఆండ్ సేఫ్ సిటీలో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషరేట్, ప్రధాన కూడళ్లతో పాటు పలు కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సిటీ మొత్తంలో 16వేల సీసీకెమెరాలు ఉన్నాయి. కానీ ఏం లాభం... అవన్నీ అలంకార ప్రాయంగా మారాయి. దొంగలను పట్టించాల్సిన సమయంలో నిద్రావస్థలో ఉన్నాయి.
 సీసీ కెమెరాలు లేకపోవడంతో వరంగల్‌లో నేరాలు ఘోరంగా జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, వరుస దొంగతనాలతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. పోలీసులు మాత్రం నిఘా వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 వారం వ్యవధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రై సిటీలో 10 చైన్ స్నాచింగ్ లు జరిగాయి. కాజీపేట పరిధిలో 10 ఇళ్లలో దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు.  ఇలా రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలతో జనం భయపడుతున్నారు.
ఓరుగల్లులోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల ప్రాంతాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించినప్పటికీ.. వేళ్లమీద లెక్కించే కెమెరాలు మాత్రమే పనిచేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment