తాజా వార్తలు

Tuesday, 11 April 2017

చంద్రబాబు సర్కార్ మరో వినూత్న పథకం!

ఎపి ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి పౌరుల సదుపాయార్ధం టోల్ ప్రీ కాల్ సెంటర్ ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 100, 108 సర్వీస్ తరహాలో ఉండే ఈ పద్దతిలో ఒక టోల్ ప్రీ పోన్ నెంబర్ ఇస్తారు. పౌరులు తమకు సంబందించిన ఏ సమస్యపైన అయినా పోన్ చేసి చెప్పుకోవచ్చు. ఆ కాల్ రిసివీ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చస్తారు.కింది స్థాయి ఉద్యోగులు,అదికారులలో అవినీతి అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజున దీనిని ఆరంభించనున్నారు. రేషన్ బియ్యం, గృహనిర్మాణం, ప్రభుత్వం నుంచి తమకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ప్రజలు తెలియచేయవచ్చు.దానిని ఆయా సంబంధిత శాఖలకు పంపించి వారి సమాదానాన్ని తెప్పించి తిరిగి తెలియ చేయాలని తలపెట్టారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోన్ లు చేయండని ఒక నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత పోన్ కు వచ్చిన కాల్స్ గురించి కాని,తదనంతరం తీసుకున్న చర్యల గురించి కాని ఎక్కడా చెప్పలేదు. ఎపిలో కూడా అలాకాకుండా ప్రజల సమస్యలు తీర్చే విధంగా కాల్ సెంటర్ పనిచేస్తే మంచిదే.ప్రస్తుతానికి సిటిజన్ ఎక్స్ లెన్స్ మేనేజ్ మెంట్ సెంటర్ అని దీనికి పేరు పెట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment