తాజా వార్తలు

Thursday, 13 April 2017

ఎక్కడయ్యా చిరంజీవిపెద్దల సభలో నామినేటెడ్‌ ఎంపీల జాడ కనిపించటం లేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొందరు మాత్రం అడపాదడఫా మాత్రమే వచ్చి వెళుతున్నారు. ముఖ్యంగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పెద్దల సభకు రావడమే మానేసారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు ఆయన కేవలం రెండే రోజులు సభకు హజరవటం చర్చనీయాంశమవుతోంది. సినిమా, క్రీడలు, సాహిత్యం, పాత్రికేయ రంగం, కవులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అందించిన సేవలకు గుర్తుగా కేంద్రం రాష్ట్రపతి కోటాలో 12 మందిని నామినేట్‌ చేస్తుంటుంది. చర్చల్లో పాలుపంచుకున్నప్పుడు వారి అనుభవం దేశానికి ఉపయోగపడుతుందని, చట్టసభలపై గౌరవం మరింత ఇనుమడిస్తుందన్నది అసలు ఉద్దేశం. ఐతే ఇప్పుడు రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖుల సభ్యుల హాజరు అతి తగ్గువగా ఉంటోంది. చాల మంది ఎంపీలు సభకు రావటమే మానేశారు. రాజ్యసభకు గైర్హజరీ జాబితాలో అన్నయ్య చిరంజీవి టాప్ లో ఉన్నారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు 31 రోజుల పాటు సాగితే ఆయన కేవలం రెండు రోజులు మాత్రమే సభకు హజరయ్యారు. మొదటి విడతలో ఒక రోజు, రెండో విడత మరో రోజు సభకు హజరై ఉన్నాంలే అనిపించారు. ఏపీ ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ రోజు కూడ ఆయన సభకు రాలేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తాల్సిన ఆయన సభ పట్ల ఆసక్తి కనబరచటం లేనట్లుంది.
రాజ్యసభ సభ్యుల రిజిస్టరు‌లోని సంతకాలను ఎంపీల హజరుకు ప్రమాణికంగా పరిగణిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 మధ్య 8 రోజులు సభజరిగితే చిరంజీవి ఒక్క రోజు  హజరైనట్లు సంతకం చేసి ఉంది. రెండో విడత మార్చి 9 నుంచి నిన్నటి వరకు 23 సార్లు సభ జరిగితే అందులో ఒకే ఒక్క రోజు హాజరయ్యారు. ఎలాగు అధికారంలో లేము కనీసం మంత్రిగా కూడా లేము అలాంటప్పుడు సభకెందుకు రావాలనుకుంటున్నారేమో చిరంజీవి. సభ నిబంధనల ప్రకారం ఆరు నెలల కాలంలో సభ్యులు కనీసం ఒక్క సారన్న పార్లమెంటుకు హజరు కావాలి. లేకపోతే పదవి ఊడిపోతుంది. అందుకే చిరంజీవి తన పదవిని కాపాడుకునేందుకు ఈ దఫా ఒక్క రోజు సభలో కనిపించాడు. సినీ రంగం నుంచి ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సభకు హజరు కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల కోసం పోరాడాల్సిన పెద్దమనిషి పత్తా లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
« PREV
NEXT »

No comments

Post a Comment