తాజా వార్తలు

Saturday, 8 April 2017

చిరంజీవి ఎప్పటికి మావాడే!

శనివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి ఆ పార్టీ నేత, ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకాకపోవడంపై ఆసక్తికర చర్చ జరిగింది. అనివార్య కారణాల వల్లే చిరంజీవి ఈ సమావేశానకి గైర్హాజరు కావాల్సి వచ్చిందని మాజీ ఎంపీ పళ్లంరాజు వివరణ ఇచ్చారు.ప్రస్తుతం చిరజీవి సినీరంగంలో కొంత బిజీగా ఉన్నారని చెప్పారు. సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలు అంతర్గత విషయాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించామని, రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించామని ఆయన అన్నారు.చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడతారనే వార్తలు వస్తుండటం, సమావేశానికి హాజరుకాకపోవడంతో పళ్లంరాజు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment