తాజా వార్తలు

Thursday, 6 April 2017

తూటా వదిలిన పాట : జనసేన వైపు అడుగులు!

దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీతో కలిసున్న విప్లవ గాయకుడు గద్దర్ మావోయిస్టు పార్టీకి గుడ్ బై చెప్పారు. అమర వీరులకు
కన్నీళ్లతో వందనాలు చెబుతూనే, చేతిలోని ఎర్రజెండాను పక్కన పెట్టి.. బుద్ధుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నారు.. ఇంతకాలం ఎర్ర జెండాను మోస్తుండేవారు. ఇకపై కొత్త జెండాను చేపడతారు. ఇప్పటివరకు ఆయన ఓటరుగా కూడా నమోదు కాలేదు. ఇటీవలే ఆయన ఓటరు అయ్యారు.పల్లెపల్లెకు పార్లమెంటు అనే నినాదంతో పనిచేస్తానని ఆయన చెబుతున్నారు.తనమీద కాల్పులు జరిగి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదు.. అంబేడ్కర్‌ ఫూలేల మార్గం అవసరమని భావిస్తున్నానని,రెండు పడవలపై కాళ్లు పెట్టలేనని ఆయన అన్నారు.ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం లేదని పేర్కొన్నారు. తాను పార్టీ పెట్టడం కాదని, పార్టీని అల్లడానికి పూలలో దారం అవుతానని గద్దర్ అంటున్నారు.6 నెలల్లో రెండు లక్షల మంది గ్రామస్థాయి నేతలను కలుస్తామని, జనసేనతో కలిసి పనిచేస్తానని గద్దర్ సంకేతాలిచ్చారు.  అంటే ఆయా పక్షాలను ఏకం చేయడానికి ఆయన ప్రయత్నిస్తారట.గద్దర్ మారిపోయారన్న మాట.

కాగా, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పవన్ కళ్యాణ్ నడిపేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజాగాయకుడిగా పేరొందిన గద్దర్‌ను పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున రంగంలోకి దింపుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. గద్దర్ అంటే తెలంగాణలో తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు.

« PREV
NEXT »

No comments

Post a Comment