తాజా వార్తలు

Tuesday, 11 April 2017

గుడివాడలో యుద్ధ వాతావరణం : టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

గుడివాడ 19వ వార్డు ఉపఎన్నికల్లో టీడీపీ విజయంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీలో ఎంతోకాలం పని చేసి 2014కు ముందు వైసీపీలో చేరి కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచే ఆ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎప్పుడు అవకాశం దొరికినా ఇరువర్గాలు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా గుడివాడ 19వ వార్డుకు ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఫలితం నియోజకవర్గాన్ని మరింత హీటెక్కించింది.

ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టగా తెదేపా అభ్యర్థి 150 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో తెదేపా శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టాయి. నగరంలోని ఓ ప్రాంతానికి ర్యాలీ చేరుకున్న సమయంలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో తెదేపా కార్యకర్తలు కూడా వారికి పోటీగా నినాదాలు చేశాడు. పరిస్థితి శ్రుతిమించి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి రెండు వర్గాలను చెదరగొట్టారు.అయితే ఇప్పటికి సర్దుమణిగా వివాదం ముగిసినట్టే కాదని స్థానికులు చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment