తాజా వార్తలు

Tuesday, 11 April 2017

రండి బాబూ రండి.. సమ్మర్ స్పెషల్ ప్రైజ్..

ఇండిగో విమాన సంస్థ ప్రయాణికుల కోసం సమ్మర్ స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. అన్ని ధరలను లెక్కచేసుకుని కేవలం రూ.999కే విమాన టికెట్టును అందించనున్నట్టు పేర్కొంది. మూడు రోజుల సమ్మర్ వెకేషన్ ఆఫర్ కింద అన్ని నెట్ వర్క్ పరిధిలో వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. 6 ఈ నెట్ వర్క్-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, రిసెంట్‌గా 900 విమానాలను ఒకేరోజు ఆపరేట్ చేసి దేశీయ విమాన రంగంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ 2017 ఏప్రిల్ 10 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే 2017 మే ఒకటి నుంచి 30 మధ్య తేదీల్లో ప్రయాణాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ తో ఈ స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపిన సంస్థ.. ఒక్కసారి ఈ టిక్కెట్‌కు చార్జీలు మళ్లి తిరిగి రీఫండ్ చేయలేమని స్పష్టం చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment