తాజా వార్తలు

Thursday, 13 April 2017

భర్తను దారుణంగా హత్య చేసిన ఇద్దరు భార్యలు

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు భార్యలు కలసి కట్టుకున్న భర్తను హత్య చేశారు. సింగరేణిలో పని చేసి రిటైర్ అయిన తిరుమలయ్యకు మదునమ్మ, ఐలమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరినీ గత కొన్నేళ్లుగా తిరుమలయ్య హింసిస్తున్నాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్యలిద్దరూ కలసి  అతన్ని చంపేశారు. తిరుమలయ్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment