తాజా వార్తలు

Thursday, 13 April 2017

ఆఫర్ల కోసం పడక గదికి..

సినిమా ఆఫర్ల కోసం దిగజారనని, తాను అలాంటి దానిని కాదని అందాల తార ఇలియానా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందనే విషయంపై ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందిన ఇలియానా, ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. గత కొద్దికాలంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లకే పరిమితమైంది.
నాది ఆ టైపు కాదు, సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదు అని ఇలియానా ఇటీవల ఓ మీడియాతో చెప్పినట్టు సమాచారం.
అవకాశాలు లేకపోయినా సరే కానీ ఏ పాత్ర పడితే అది చేయను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ఠ దెబ్బ తింటుంది అని ఇలియానా పేర్కొన్నట్టు తెలిసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment