Writen by
vaartha visheshalu
00:38
-
0
Comments
ప్రముఖ సినీ నటి రాధిక ఐటీ దాడులతో చిక్కుల్లో పడ్డారు. ఆమెకు చెందిన రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. రాధిక భర్త, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ నివాసంలో ఇటీవల ఐటీ అధికారులు రెండుసార్లు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
ఆర్కేనగర్ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే నాయకుల నుంచి భారీగా నగదును అందుకుని ఆ పార్టీ అభ్యర్థి దినకరనకు చివరిక్షణంలో శరత్‌కుమార్ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు శరత్‌కుమార్ నివాసంతో పాటు, ఆయన సతీమణి రాధిక నడుపుతున్న రాడాన్ సంస్థ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. రెండుసార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం వారిద్దరూ ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
పన్ను ఎగవేత ఈ విచారణలో రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తేలిందని ఐటీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ మొత్తం చెల్లించేందుకు రాధిక, శరత్ కుమార్ అంగీరించినట్లు సమాచారం.
No comments
Post a Comment