తాజా వార్తలు

Friday, 7 April 2017

క్షమాపణ చెప్తే మర్చిపోయే అవమానం కాదిది.. : పవన్ కళ్యాణ్

నల్లవాళ్లంటూ దక్షిణాది రాష్ట్రాలనుద్దేశించి బిజెపి నేత.. ఆపార్టీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.‘‘దక్షిణ భారతం నుంచి ఎంత తీసుకున్నారు. ఎంత తిరిగి ఇచ్చారు’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్.‘దక్షిణాదికి చెందిన మహనీయుడే జాతీయ పతాకాన్ని రూపకల్పన చేశారు. ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కన్పిస్తోంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి’ అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. వరుస ట్వీట్లలో ఉత్తరాధి ఆధిపత్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. కాగా, ఆఫ్రికన్ జాతీయులపై దాడుల గురించి అడిగిన ప్రశ్నకు బిజెపి నేత తరుణ్ విజయ్ స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది. నల్ల జాతీయుల గురించి తమకు ఎలాంటి వివక్షా లేదని.. ఆ మాటకొస్తే, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ప్రజలంతా నల్లవాళ్లేనని వాళ్లతో తాము కలిసి జీవించడంలేదా అని వ్యాఖ్యానించారు. తరువాత ఈ విషయంపై ఆయన క్షమాపణలు చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో క్రితం ‘ఉత్తరాది అహంకారం’ అంటూ ఆయన పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment