తాజా వార్తలు

Friday, 7 April 2017

పవన్ క్రేజ్ లో కీర్తి ఏం చేసిందో చూసారా?

టాలీవుడ్ అగ్రహీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయనతో కలిసి నటించేందుకు అనేక మంది హీరోయిన్లు పోటీపడుతుంటారు. ముఖ్యంగా.. కుర్రకారు నటీమణులు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్… ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ కోటిన్నర వరకూ పారితోషికం తీసుకుంటోందట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పారితోషికం విషయంలో కాంప్రమైజ్ అయ్యిందట.అంతే కాదు పవన్‌ సినిమాలో నటించే హీరోయిన్‌కు స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందని ఫిల్మ్‌నగర్‌ సెంటిమెంట్‌. గతంలో కీర్తి రెడ్డి, భూమిక, శృతీహాసన్‌ వంటి హీరోయిన్లు పవన్‌తో నటించిన తర్వాతే గుర్తింపు పొందారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాను కూడా చేరాలనుకుంటోందట కీర్తి. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందతోన్న సినిమా కాబట్టి ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే కీర్తి సురేష్ పక్కా ప్లాన్ తో పవన్ తో రొమాన్స్ కి అంగీకరించిందట. ఈ సినిమా కోసం కొంచెం బరువు తగ్గుతానని కూడా మాటిచ్చిందట. మొత్తం మీద టాలీవుడ్ లో పాగా వేయడానికి కీర్తి బాగానే పావులు కదుపుతోందని చెప్పొచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment