తాజా వార్తలు

Monday, 17 April 2017

కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా

విజయవాడ ఎమ్.పి కేశినేని నాని కి చెందిన కేశినేని ట్రావెల్స్ సంస్థ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఏడాదిగా తమకు జీతాలు ఇవ్వడం లేదని,పైగా రాత్రికి రాత్రే సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఐదు వందల మంది డ్రవైర్లు, ఇతర సిబ్బంది నాని కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా,జీతాల బకాయిలు ఇవ్వకుండా సంస్థను ఎలా మూసివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే నాని తన కార్యాలయంలో లేరు. దాంతో నాని వచ్చాక చర్చలకు పిలుస్తామని ఆయన సన్నిహితులు చెప్పి పంపించేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment